పాకిస్థాన్లో ఘోర ప్రమాదం: ఆసుపత్రి అంబులెన్స్లో సిలిండర్ పేలి పది మంది దుర్మరణం

రిపోర్టర్: కిరణ్ స్థలం: థార్‌పార్కర్

పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో జరిగిన ఘోర ప్రమాదంలో నవజాత శిశువుతో సహా పది మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. థార్పార్కర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిలిపి ఉంచిన అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.