కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి పితృవియోగం

రిపోర్టర్: విజయ్ స్థలం: నాగర్‌కర్నూల్

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి బీరం లక్ష్మారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. లక్ష్మారెడ్డి మృతిపట్ల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా సింగోటంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.