వాహనదారులకు భారీ ఊరట: నవంబర్ 1 నుంచి కొత్త ఫాస్టాగ్ పాస్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

నేషనల్ హైవేలపై రాకపోకలు సాగించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ ఊరట కల్పించనుందని అధికారులు వెల్లడించారు. నవంబర్ 1 నుంచి కొత్త లోకల్ ఫాస్టాగ్ పాస్ విధానం అమల్లోకి రానున్నట్లు తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకు ఈ కొత్త వార్షిక పాస్ విధానం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.