చిత్తూరులో శ్రీనివాస కల్యాణానికి పటిష్ట భద్రత.. మెసానిక్ గ్రౌండ్లో బందోబస్తును పరిశీలించిన డిఎస్పీ!
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
చిత్తూరు నగరంలోని మెసానిక్ గ్రౌండ్లో ఈ శనివారం ఘనంగా నిర్వహించనున్న శ్రీనివాస కల్యాణం కార్యక్రమానికి సంబంధించి జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు సబ్ డివిజన్ డిఎస్పీ జె.వెంకటనారాయణ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక వన్ టౌన్ సీఐ చిన్న పెదయ్య, ట్రాఫిక్ సీఐ నరసింహరాజులతో కలిసి భద్రత, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్ అంశాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని డిఎస్పీ విజ్ఞప్తి చేశారు.