టెక్కలిలో రైలు ప్రమాద స్థలిని పరిశీలించిన ఎస్పీ మహేశ్వర రెడ్డి
రిపోర్టర్: నరేష్
స్థలం: టెక్కలి
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై జిల్లా పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్ ప్రమాదం జరిగిన తీరును స్వయంగా పరిశీలించారు. ఈ రైలు ప్రమాదానికి గల అసలు కారణాలపై రైల్వే అధికారులను ఆయన ఆరా తీశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ ఆదేశించినట్లు జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది.