అమెరికా ఉగ్రవాద చర్యలతో ఇరాన్ ప్రజలు బలయ్యారన్న పెజెష్కియాన్
రిపోర్టర్: వెంకట్
స్థలం: New York
అమెరికా ఉగ్రవాదానికి ఇరాన్ ప్రజలు బలయ్యారని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తీవ్రంగా ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ఆయన మాట్లాడుతూ, తమపై పిరికిపందలా దాడులు చేశారని మండిపడ్డారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని, బలవంతపు చర్యలను అంగీకరించబోమని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికగా అమెరికా తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.