విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన మున్సిపల్ చైర్మన్
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో కలిసి ఆయన అల్పాహారం స్వీకరిస్తూ ఎంతో ఉత్సాహంగా ముచ్చటించారు. కళాశాలలోని మౌలిక వసతులపై అధికారులను ఆరా తీసిన చైర్మన్, విద్యార్థులు కష్టపడి చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, విద్యార్థులకు, పారిశుధ్య నిర్వహణకు మున్సిపాలిటీ తరఫున అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తమ వద్దకు స్వయంగా వచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నందుకు విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.