గోదాముల్లో మూలుగుతున్న రేషన్ బియ్యం: పురుగులు పట్టి పాడవుతున్న నిల్వలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో అక్రమ రవాణాలో పట్టుబడిన రేషన్ బియ్యం గోదాముల్లోనే మూలుగుతున్నాయి. రెండేళ్లుగా సుమారు 93 టన్నుల బియ్యం నిల్వలు ఆత్మకూరు, కావలి, పొదలకూరు గోదాముల్లో పాడవుతున్నాయి. అధికారులు సీజ్ చేసిన బియ్యాన్ని పట్టించుకోకపోవడంతో పురుగులు పట్టి వృథా అవుతున్నాయి. పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణ లోపంతో ప్రజా పంపిణీకి చేరాల్సిన బియ్యం నిరుపయోగంగా మారుతున్నాయి. అక్రమ రవాణాపై కేసులు నమోదవుతున్నా, నిల్వల నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.