దుబాయ్ నగరానికి విస్తరించిన ఎతిహాద్ రైల్ ప్రయాణ సేవలు
రిపోర్టర్: మహేష్
స్థలం: Dubai
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ప్రముఖ నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఎతిహాద్ రైల్ తన ప్రయాణ నెట్‌వర్క్‌ను దుబాయ్‌కు విస్తరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 30, 2026 నుంచి ప్రారంభమైన ఈ సేవలు దుబాయ్‌ను అబుదాబి, ఫుజైరా నగరాలతో అనుసంధానిస్తాయని పేర్కొన్నారు. అల్ యలాయిస్ స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు ప్రయాణానికి సంబంధించి కంఫర్ట్ క్లాస్ టికెట్ ధర సుమారు 39 దిర్హమ్ లుగా నిర్ణయించినట్లు వెల్లడించారు.