ఆరోగ్యమే మహాభాగ్యమంటూ ఘనంగా అంగన్వాడీ ఉత్సవాల నిర్వహణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆత్మకూరు
జాతీయ పోషణ మాసం–2026లో భాగంగా ఆత్మకూరు మండలంలోని ఎల్ఆర్.పల్లి–1 అంగన్వాడీ కేంద్రంలో ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యకర్త ఎస్.కె. షకీలా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహార ప్రాధాన్యాన్ని వివరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు లభించే పదార్థాలను ప్రదర్శించారు. చిన్నారులకు అందుతున్న విద్య, ఆటపాటలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.