మంగళగిరి నరసింహస్వామి ఆలయ చీకటి కోనేరుకు మహర్దశ: మంత్రి లోకేశ్ ప్రత్యేక చొరవ
రిపోర్టర్: వెంకట్
స్థలం: మంగళగిరి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని చారిత్రాత్మక చీకటి కోనేరుకు మహర్దశ పట్టిందని అధికారులు తెలిపారు. గత పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతం పిచ్చిమొక్కలతో నిండిపోయి దుర్వాసన వచ్చేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ చూపించారని వెల్లడించారు. పది లక్షల రూపాయల నిధులతో పరిసర ప్రాంతంలో టైల్స్ వేయించి, కోనేరు చుట్టూ స్టీల్ గ్రిల్స్ మరియు భక్తుల కోసం సిమెంటు బల్లలను ఏర్పాటు చేయించడంతో ప్రస్తుతం ఎంతో సౌకర్యవంతంగా మారిందని అధికారులు స్పష్టం చేశారు.