ఏపీ పోలీసు శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: పల్నాడు

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మంగళగిరిలోని డయల్ 112 స్టేట్ కంట్రోల్ రూమ్‌లో కస్టమర్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ పర్సనెల్ పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ డిగ్రీ లేదా బీటెక్ అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2026గా నిర్ణయించారు.