ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ విభాగంలో పతకం ఖాయం చేసుకున్న మానూష్ దియా జంట

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూఢిల్లీ

ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్ తరఫున మానూష్ షా, దియా చిటాలే జోడీ పతకం ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో ప్రపంచ నాల్గో సీడ్ జోడీపై ఘన విజయం సాధించి సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఈ చారిత్రాత్మక విజయంతో టేబుల్ టెన్నిస్ చరిత్రలో భారత్కు అరుదైన ఘనత దక్కింది. సెమీస్లో చైనా జోడీతో వారు తలపడనున్నారు.