యాదాద్రి ఆలయంలో వైభవంగా జరిగిన శ్రీ ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదాద్రి

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం అద్దాల మండపంలో ఊంజల్ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖమండపంలో శ్రీమన్యు సూక్త పారాయణం, కుంకుమార్చన, సువర్ణ పుష్పార్చన జరిపిన అనంతరం అమ్మవారిని తిరువీధుల గుండా ఊరేగించి భక్తులు మంగళ నిరాజనాలు సమర్పించారు. శివాలయంలో మహాచండీయాగం కూడా ఘనంగా జరిగింది.