ఐరాస కొత్త మ్యాప్‌పై అరుణాచల్ ప్రదేశ్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రాజేష్
స్థలం: అరుణాచల్ ప్రదేశ్
ఐక్యరాజ్యసమితి రూపొందించిన కొత్త జియోస్పేషియల్ మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను భారత్ వెలుపల చూపడం వివాదస్పదమైంది. దీనిపై సీఎం పెమా ఖండూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాప్‌లోని గీతలు సరిహద్దులను నిర్వచించవని, అరుణాచల్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.