మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్లో వంగలపూడి అనిత ప్రశంసలు

రిపోర్టర్: నరేష్ స్థలం: అనకాపల్లి

తొమ్మిది నెలల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని పోలీస్ కానిస్టేబుళ్లుగా బాధ్యతలు స్వీకరిస్తున్న 473 మంది మహిళా కానిస్టేబుళ్లను కలవడం ఎంతో గర్వంగా ఉందని వంగలపూడి అనిత అనకాపల్లి పేర్కొన్నారు. తండ్రి గత ఆరు నెలలుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, కుటుంబ బాధ్యతలను ధైర్యంగా అధిగమించి శిక్షణను పూర్తి చేసిన ఓపీలియా పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమని ఆమె కొనియాడారు. కష్టాలను ఎదురించి ఉన్నత లక్ష్యాలను సాధించే మహిళల అంకితభావం సమాజానికి ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు.