వేమూరు జంపని గ్రామాల్లో వినాయక వేడుకల్లో పాల్గొన్న నక్కా ఆనందబాబు

రిపోర్టర్: హరి స్థలం: అమృతలూరు

అమృతలూరు మండలం వేమూరు, జంపని గ్రామాల్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుభకార్యాన్ని విఘ్నేశుని పూజతో ప్రారంభించడం మన సాంప్రదాయమని, ఈ వేడుకలు ప్రజల్లో ఆధ్యాత్మికతతో పాటు సామాజిక స్పృహ, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.