జపాన్ను వణికిస్తున్న దుజువాన్ తుఫాన్ తీవ్ర ప్రభావం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
జపాన్లో దుజువాన్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తూర్పు జపాన్ను అతలాకుతలం చేస్తున్న ఈ తుఫాన్ కారణంగా సోమవారం జరగాల్సిన ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్ ఈవెంట్లను మంగళవారానికి వాయిదా వేశారు. టోక్యో మహానగరం వైపు దూసుకొస్తున్న ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. జపాన్ వాతావరణ శాఖ రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.