ఖమ్మంలో తల్వార్లతో విన్యాసాలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఇద్దరిపై కేసు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లిలో తల్వార్లతో విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బుడేడ ఈశ్వర్ మరియు బుడేడ నర్సింహారావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూరజ్ తెలిపారు. పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాలతో విన్యాసాలు చేసి ప్రజలను భయపెట్టడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ యువత ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.