రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

రిపోర్టర్: మహేష్ స్థలం: Telangana

తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలతో పాటు పలు ప్రాంతాలలో రానున్న రెండు మూడు గంటల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ టి. బాలాజీ తెలిపారు. మిగతా జిల్లాలలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుందని ఆయన తన తాజా వాతావరణ హెచ్చరికలో స్పష్టం చేశారు.