యలహంక ఆస్తి వివాదం: నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం లేదు అంటూ షర్మిల ఫైర్

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

బెంగళూరులోని యలహంక ఆస్తిపై తనకు, తన పిల్లలకు నూటికి నూరు శాతం పూర్తి హక్కు ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఆస్తుల పంపకాల్లో భాగంగానే ఆ ప్రాపర్టీ తమ భాగానికి వచ్చిందని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తనది కాని దానికోసం ఆశపడే నీచత్వం తనది కాదని పేర్కొంటూ షర్మిల చేసిన ఈ తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.