నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్
రిపోర్టర్: హరి
స్థలం: నెల్లూరు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. హెలిప్యాడ్ వద్ద ఏపీ మంత్రులు నారాయణ, వై. సత్యకుమార్, బీజేపీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.