తెలంగాణ ఉద్యమ సకల జనభేరి చారిత్రక ఘట్టమని శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
రిపోర్టర్: అశోక్
స్థలం: మహబూబ్ నగర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సకల జనభేరి ఒక కీలక ఘట్టంగా నిలిచిందని మహబూబ్ నగర్ మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మంది తెలంగాణవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిన చారిత్రక సంఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. ఉద్యమ స్ఫూర్తిని, ప్రజల పోరాట పటిమను చాటే అద్భుతమైన సందర్భమని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేస్తూ ఆనాటి జ్ఞాపకాలను మరోసారి నెరుకువ చేసుకున్నారు.