బెంగళూరులో గ్యాస్ సిలిండర్ లీకై అగ్నిప్రమాదం: తృటిలో తప్పిన పెను ప్రమాదం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: బెంగళూరు

బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఎల్పీజీ సిలిండర్ డెలివరీ చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంటి గుమ్మం వద్ద ఉన్న నూనె దీపం నుంచి మంటలు సిలిండర్ కు అంటుకోవడంతో డెలివరీ బాయ్ ప్రాణభయంతో పరుగులు తీశాడు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సిలిండర్ల వినియోగంలో ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.