యువ అభిమానికి బూట్లు బహుమతిగా ఇచ్చిన సోఫీ కన్నింగ్‌హామ్
రిపోర్టర్: విజయ్
స్థలం: USA
పోర్ట్‌ల్యాండ్‌తో జరిగిన డబ్ల్యూఎన్‌బీఏ మ్యాచ్‌లో ఇండియానా ఫీవర్ విజయం సాధించిన తర్వాత, క్రీడాకారిణి సోఫీ కన్నింగ్‌హామ్ గ్యాలరీలో ఉన్న ఓ చిన్నారి అభిమానికి తాను ధరించిన షూను బహుమతిగా ఇచ్చారు. ఈ అరుదైన బహుమతి చూసి ఆశ్చర్యపోయిన చిన్నారి ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంది. ఈ హృదయపూర్వక సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.