తుఫాన్ బాధితులకు అండగా తెలంగాణ: ఏపీకి విద్యుత్ సహాయక బృందాలు తరలింపు

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి వెంటనే ప్రత్యేక సహాయక బృందాలను పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల వేళ ప్రాంతీయ భేదాలు పక్కనబెట్టి తెలంగాణ ప్రభుత్వం అందించిన ఈ సహకారం ఇరు రాష్ట్రాల మధ్య సోదరభావానికి నిదర్శనంగా నిలిచింది.