మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న డొమినికన్ భామ.
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
వియత్నాంలో అట్టహాసంగా జరిగిన 73వ మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జొహైరీ మోలో డొమింగ్యూజ్ 2026 మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. 110 దేశాల సుందరీమణులతో పోటీపడి ఆమె ఈ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. దాదాపు 44 ఏళ్ల తర్వాత డొమినికన్ రిపబ్లిక్‌కు ఈ ప్రతిష్టాత్మక టైటిల్ దక్కడం విశేషం. స్పెయిన్ భామ ఎలిసబెత్ రేనెస్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు.