హైదరాబాద్‌లో గంజాయి గొడవ కారణంగా కత్తితో యువకుడి హత్య
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై గంజాయి అక్రమ రవాణా సమాచారం ఇస్తున్నాడనే అనుమానంతో మహ్మద్ వసీమ్ అనే ముప్పై రెండేళ్ల యువకుడిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఉప్పర్‌పల్లి ప్రాంతంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు సోహైల్, ఇల్యాస్‌ల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.