జాతీయ అదాలత్ లో పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయనగరం

జాతీయ అదాలత్ లో మోటార్ ప్రమాద బీమా, బ్యాంకులు మరియు చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించిన పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అధికారులను కోరారు. విజయనగరం రూరల్ లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అధికారులు, న్యాయవాదులు ప్రత్యేక చొరవ చూపాలని స్పష్టం చేశారు. బాధితులకు ఆర్థిక సాయం అందేలా చూడాలని ఆమె సూచించారు.