'ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్టీఆర్ చేసిన పోరాటం మరువలేనిది': మాజీ స్పీకర్ ప్రతిభాభారతి

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలతో 1984 ఆగస్టు 16న సీఎం పదవిని కోల్పోయిన నందమూరి తారక రామారావు నెల రోజుల వ్యవధిలో దేశవ్యాప్త ఉద్యమంతో తిరిగి అధికారాన్ని దక్కించుకున్నారని వక్తలు గుర్తుచేశారు. ఈ చరిత్రాత్మక ఘటనను పురస్కరించుకొని హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. ఎన్టీఆర్‌ను తిరిగి సీఎం స్థానంలో కూర్చోబెట్టడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారని మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి పేర్కొనగా, ఎన్టీఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పలువురు వక్తలు నివాళులర్పించారు.