రామనారాయణంలో జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ పోటీల ప్రారంభం

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా రామనారాయణం ప్రాంగణంలో నూట ఆరవ ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్సీ గాదే శ్రీనివాస నాయుడు మరియు కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఎస్.ఎస్ శాస్త్రి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్చరీ క్రీడతో విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుందని, విజయం సాధించాలనే తపన కలుగుతుందని వెల్లడించారు. విలువిద్య నేర్చుకోవడంతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని వారు స్పష్టం చేశారు.