కాశీబుగ్గలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
రిపోర్టర్: Dinesh panda
స్థలం: పలాస
కాశీబుగ్గ సత్యసాయిబాబా మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు కుంకుమ పూజలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
శ్రీకృష్ణుడు, రాధల వేషధారణలో వచ్చిన చిన్నారుల కోలాట నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉట్టికొట్టే కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. కన్వీనర్ నాగరాజుతో పాటు భక్తులు స్వామివారి సేవలో తరించారు.