అక్రమ విధానాలపై చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాడాలని హరీశ్రావు పిలుపు

రిపోర్టర్: విజయ్ స్థలం: గజ్వేల్

భూమి, భుక్తి కోసం గడీలపై పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. గజ్వేల్లో ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో ఆమె స్ఫూర్తి కీలకమని తెలిపారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్లో ఐలమ్మ భవనాన్ని నిర్మించామని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం గతంలో జరిగిన అభివృద్ధికి రంగులు వేసే పరిస్థితిలో కూడా లేదని హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు.