నేపాల్‌లో భీకర వరదలు: 1,282కి చేరిన మృతులు, 600 మంది పిల్లలు అదృశ్యం!
రిపోర్టర్: సతీష్
స్థలం: World
నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1,282కి చేరింది. రసువా, నువాకోట్ జిల్లాల్లో సుమారు 600 మంది పిల్లలతో పాటు మొత్తం 4,700 మందికి పైగా గల్లంతయ్యారు. నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు చరియలు విరిగిపడటంతో ఈ పెనువిపత్తు చోటుచేసుకుంది. భద్రతా దళాల సంయుక్త బృందం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.