బ్యాడ్మింటన్ సంచలనం: హైలో ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధు

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జర్మనీలో జరిగిన హైలో ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ లో మహిళల సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఫైనల్ పోరులో డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ హోజ్మార్క్ పై 21-12, 21-14 తేడాతో విజయం సాధించారు. కేవలం ముప్ పై తొమ్మిది నిమిషాల్ లో ముగిసిన ఈ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు, ఈ సీజన్ లో తన రెండో టైటిల్ను ఖాతాలో వేసుకుని దేశం గర్వించదగ్గరీతిలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.