సీతారామ ప్రాజెక్టును తక్షణమే పూర్తిచేయాలి: కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. వర్షాభావంతో కరువు జిల్లాలుగా ప్రకటించి పంట నష్టపరిహారం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. వరికి ఎకరాకు ముప్పై వేలు, ఇతర పంటలకు ఇరవై వేలు, పత్తికి యాభై వేల రూపాయలు చెల్లించాలని కోరారు. సీతారామ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని నేతలు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.