'స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు': ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 అత్యంత ప్రాముఖ్యమైన ప్రత్యేక దినమని, నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన చారిత్రక సందర్భమని నిపుణులు పేర్కొన్నారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే, హైదరాబాద్ సంస్థాన ప్రజలు మరో 13 నెలల పాటు నిజాం అణచివేతను ఎదుర్కొన్నారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని, దీంతో ప్రజలు పూర్తిస్థాయిలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సాధించారని ఈ వేడుకలు సగర్వంగా గుర్తు చేస్తున్నాయి.