రాత్రి వేళల్లో ఆదర్శ పాఠశాల నుంచి బాలికలు పరార్
రిపోర్టర్: SYAM
స్థలం: సీతారామపురం
సీతారామపురం మండలంలోని ఆదర్శ పాఠశాలలో రాత్రి వేళల్లో ఇద్దరు విద్యార్థినులు గోడ దూకి బయటకు వెళ్లిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి దాటాక హాస్టల్కు తిరిగి వచ్చిన ఈ విషయాన్ని సిబ్బంది గోప్యంగా ఉంచారు. పాఠశాలలో గతంలోనూ అనేక అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై బాధ్యులైన సిబ్బందిపై పైస్థాయి అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.