రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా ముగిశాయని డీజీపీ హరీష్కుమార్ గుప్తా స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్ లో చోటుచేసుకున్న ఘర్షణలపై సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తిస్తామని, అక్రమాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఎన్నికల విధుల్ లో అంకితభావంతో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.