విజయవాడలో వైభవంగా దసరా ఉత్సవాలు: ఇంద్రకీలాద్రిపై భక్తులకు దుర్గమ్మ దర్శనం

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. తొలిరోజు బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది భక్తుల కోసం అన్ని దర్శనాలు ఉచితంగా కల్పించామని, అంతరాలయ దర్శనం రద్దు చేశామని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కృష్ణా తీరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, వీవీఐపీల ప్రొటోకాల్కు వేర్వేరు సమయాలు కేటాయించామని వారు స్పష్టం చేశారు.