పోషకాహార లోప నివారణకు అంగనవాడి కేంద్రాల ప్రత్యేక అవగాహన

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడి స్కూల్లో పోషక మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఆదినారాయణమ్మ మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, పిల్లలకు పౌష్టిక ఆహారం, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడి సిబ్బంది మహిళలకు సరైన పోషకాహారం తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను వివరించారు.