తుపాను ధాటికి ఇళ్లు కోల్పోయిన కొయ్యూరు బాధితులను ఆదుకోవాలని వినతి
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: కొయ్యూరు
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో అర్నబ్ తుపాన్ ప్రభావంతో అన్నవరం గ్రామంలో మూడు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల కారణంగా మర్రి లింగన్న, పాంగి ప్రసాద్ అలాగే సీందేరి సత్తిబాబు నివాసాలు తీవ్రంగా నష్టపోయాయి. తమ ఇళ్లు కోల్పోయిన బాధితులు ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.