ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
రిపోర్టర్: విజయ్
స్థలం: గుంటూరు
గుంటూరు నగరంలోని 48వ డివిజన్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక వసతులపై వచ్చిన ఫిర్యాదులపై ఆయన వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.