అమెరికాలో నాట్స్ విస్తరణ: న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం
రిపోర్టర్: కిరణ్
స్థలం: న్యూజెర్సీ
న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగులను నియమించినట్లు నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ తెలిపారు. నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల పాల్గొన్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ నియామకం జరిగిందని పేర్కొన్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, సేవా కార్యక్రమాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.