అమెరికా వీసా ఆంక్షలపై స్పందించిన టీసీఎస్: వ్యాపారానికి ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టత

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

అమెరికా ప్రభుత్వం హెచ్-1బి వీసా ఉద్యోగుల గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ కార్యక్రమం నుంచి పలు ప్రధాన ఐటీ సంస్థలను సస్పెండ్ చేయడంపై భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ అధికారికంగా స్పందించింది. యూఎస్ కార్మిక శాఖ ఇచ్చే ప్రతీ ఆదేశానికి తాము సంపూర్ణంగా కట్టుబడి ఉంటామని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ స్పష్టం చేసింది. ఈ సస్పెన్షన్ వేటు వల్ల తమ వ్యాపార వ్యూహాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.