వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్: స్ట్రే వేకెన్సీ రౌండ్ గడువు పొడిగింపు
రిపోర్టర్: మహేష్
స్థలం: కర్ణాటక
కర్ణాటక నీట్ యూజీ వైద్య, దంత వైద్య సీట్ల భర్తీకి సంబంధించి స్ట్రే వేకెన్సీ రౌండ్ గడువును పొడిగిస్తున్నట్లు కేఈఏ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అర్హులైన అభ్యర్థులు నిర్దేశిత కోర్సు ఫీజును అక్టోబర్ 19వ తేదీ ఉదయం 11 గంటలలోపు చెల్లించాలని స్పష్టం చేశారు. అలాగే ఆప్షన్ల నమోదు గడువును కూడా అదే రోజు మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు.