వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి కృపతో ప్రజల జీవితాల్లో ఆనందం, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఉత్సవ కమిటీలకు ఆర్థిక భారం తగ్గించేందుకు గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పండుగను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.