కాంగ్రెస్ ఎంపీ లైంగిక వేధింపుల ఉదంతం: రాహుల్ గాంధీ మౌనంపై పురందేశ్వరి ఆగ్రహం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
జేఎన్యూలో విద్యార్థినులపై కాంగ్రెస్ ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మౌనం వహించడాన్ని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా ఆక్షేపించారు. విచారణలో పదకొండు మంది విద్యార్థినులను వేధించినట్లు రుజువైనా కాంగ్రెస్ అగ్రనాయకత్వం స్పందించకపోవడం దారుణమని ఆమె మండిపడ్డారు. నిందితుడిని కాపాడేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మహిళా భద్రతపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శిస్తూ ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించినట్లు పురందేశ్వరి స్పష్టం చేశారు.