పెద్దపల్లిలో సింగరేణి కార్మిక గర్జన: కేటీఆర్ హాజరుపై గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం

రిపోర్టర్: రాము స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ నెల 14న నిర్వహించనున్న సింగరేణి కార్మిక గర్జన సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హానుగున్నారని బిఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలో కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, భారీగా కార్మికులను సమీకరించి సభను విజయవంతం చేస్తామని నాయకులు వెల్లడించారు.