గ్రేడ్ 9 బొగ్గుపై సీఎం రేవంత్, మంత్రి భట్టి అసత్య ప్రచారమన్న జగదీష్ రెడ్డి
రిపోర్టర్: సురేష్
స్థలం: సూర్యాపేట
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గ్రేడ్-9 బొగ్గు దొరకదని సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడటం అవాస్తవమని స్పష్టం చేశారు. సింగరేణిలో జీ-9 రకం బొగ్గు నిక్షేపాలు ఉన్న గనులు 13 ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.